భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ'. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఈ మైథలాజికల్ ఎపిక్ పై అంచనాలు రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. లేటెస్ట్ గా 'రావణ తాండవం' గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ముఖ్యంగా రావణుడిగా యష్ కనిపించిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్ సాంగ్‌లో యష్ లుక్, హావభావాలు, గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లంకాధిపతి రావణుడి బలం, శివభక్తి, రాజసం ప్రతిబింబించేలా ఈ సీక్వెన్స్‌ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. శివుడితో రావణుడికి ఉన్న అనుబంధం, శివతాండవ స్తోత్రం నేపథ్యాన్ని గుర్తుచేసే ఈ సంగీత ఘట్టం.. విజువల్ వండర్‌గా నిలవనుందనే ఆసక్తిని పెంచుతోంది.
ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో విశేషం. భాషను బట్టి స్టార్ సింగర్స్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. హిందీలో విశాల్ దద్లానీ, తమిళంలో అనిరుధ్ రవిచందర్, జి.వి. ప్రకాశ్ కుమార్ గాత్రం అందించగా, తెలుగు వెర్షన్లో దేవిశ్రీ ప్రసాద్, కన్నడలో రవి బస్రూర్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకులు గాయకులుగా మారడం ఈ పాటకు అదనపు క్రేజ్ తీసుకొచ్చింది.
ఇక ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. పశ్చిమ బెంగాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించినట్లు సమచారం. దీంతో ఈ చిత్రం టికెట్ ధరలు తగ్గి ప్రేక్షకులకు ప్రయోజనం కలిగే అవకాశముంది.
ALSO READ : SS Rajamouli : 'వారణాసి' షూటింగ్‌కు మరో 10 రోజులే..
తొలి భాగం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని దీపావళి 2027కు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కూడా అయింది. ఐమ్యాక్స్‌తో పాటు ఐదు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.. రాముడు, రావణుడి పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
