Allari Naresh Movie: అల్లరి నరేష్ నుంచి మరో కామెడీ ట్రీట్.. ‘రంభ ఊర్వశి మేనక’ రిలీజ్ డేట్ ఫిక్స్

Allari Naresh Movie: అల్లరి నరేష్ నుంచి మరో కామెడీ ట్రీట్.. ‘రంభ ఊర్వశి మేనక’ రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లరి నరేష్ హీరోగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో  రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన చిత్రం  ‘రంభ ఊర్వశి మేనక’. సెప్టెంబర్ 4న సినిమా రిలీజ్. ఈ  సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌టైనర్. ఊర్లోనే ఉండి హీరో అవ్వాలని కలలు కనే నరేష్‌‌.. తన ఇంట్లో ఉన్న ఓ మేజిక్ బుక్ గురించి తెలుసుకుంటాడు.

ఆ పుస్తకంపై ప్రత్యేకమైన ప్యాటర్ట్‌‌ను కరెక్ట్‌‌గా గీస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. వాళ్లు దిగకముందు, దిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది. అన్ని జనరేషన్స్‌‌కు నచ్చే యూనివర్సల్‌‌ కామెడీ టైమింగ్‌‌ నరేష్ గారిది.

కొంతకాలంగా విభిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆయన ఈ సినిమాతో మళ్లీ తన కంఫర్ట్ జోన్‌‌లోకి వస్తున్నారు. ఇందులో ఆయన  కామెడీ ఫుల్ ర్యాంపేజ్‌‌లో ఉంటుంది. అది కూడా చాలా జెన్యూన్‌‌గా, ప్యూర్‌‌‌‌గా ఉంటూ ఆరోగ్యకరమైన నవ్వులు పంచుతుంది.  అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు.