జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం విశ్వక్ సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షా బంధనం, నవ కలుష స్థపనం, మహా హోమంతో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించారు.
రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు, పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ కొదుమగుళ్ల శ్రీధరాచార్యులు,ఆలయ చైర్మన్ దుగ్గినాల రవీందర్, వైస్ చైర్మన్ తిరుపతిరావు, ట్రెజరర్ రాజు, ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రావు, రాజేశ్వర్ రావు, రవీందర్ రావు, సంపత్ రావు, మహేందర్, వెంగల్ రావు, రంజిత్ కుమార్ పాల్గొన్నారు.