
హనుమాన్ (HanuMan)..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించాడు. మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది హనుమాన్.
దీంతో ఈ సీక్వెల్ పై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. జై హనుమాన్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హనుమాన్ గా ఏ హీరో కనిపిస్తారు? రిలీజ్ ఎప్పుడు ఉంటుంది? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు ఆడియన్స్.
On the auspicious day of #RamMandirPranPrathishtha pic.twitter.com/9JesFx4piR
— Prasanth Varma (@PrasanthVarma) January 23, 2024
దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రశాంత్ వర్మ..దృష్టిలో ఉన్న హీరో ఎవరు? అనే సందేహాలు ఫ్యాన్స్ లో చాలానే ఉన్నాయి. అయితే జై హనుమాన్ స్టోరీ అంతా ఆంజనేయుడి పాత్ర చుట్టూనే ఉండటంతో..బలమైన హీరో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
హనుమాన్ ట్రైలర్లో..కనిపించిన హనుమాన్ పేస్ చూస్తే..అందరూ చిరంజీవి అనుకున్నారు. కానీ, సినిమా చూసాక చిరు కాదని తెలిసిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా నెటిజన్స్ దృష్టికి హనుమాన్ మూవీలోని ఫోటో ఒకటి బయటికి వచ్చించి. ఆ ఫొటోలోని కళ్ళను, సగం ఉన్న ఫేస్‌ని గమనిస్తే ఇట్టే అర్ధమైపోతుంది..దగ్గుబాటి రానా(Rana Daggubati) అని.
జై హనుమాన్‌లో ఆంజనేయుడుగా రానా అనేందుకు మరో కారణం కూడా ఉంది..హనుమాన్ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట రోజు జై హనుమాన్ స్క్రిప్ట్ సిద్ధమైందని ప్రశాంత్ వర్మ తెలిపారు.