టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హిట్ పెయిర్ స్క్రీన్‌పై కనిపిస్తేనే థియేటర్లలో పూనకాలే. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ 'రణబాలి' (Ranabaali). 'శ్యామ్ సింగరాయ్' లాంటి క్లాసిక్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది.
గండికోటలో షూటింగ్..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాయలసీమ ఖిల్లాలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. వైఎస్‌ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో 'రణబాలి' చిత్రం సరికొత్త యాక్షన్ షెడ్యూల్ షురువైంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు, రాయలసీమ చారిత్రక బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో.. గండికోటలోని చారిత్రక కట్టడాలు ఈ సినిమాకు పర్‌ఫెక్ట్ లొకేషన్లుగా మారాయి.
కోట గోడల మధ్య వేట..
లేటెస్ట్ గా గండికోట ముఖద్వారం, ధాన్యాగారం వద్ద భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ చేస్తూ శత్రువులను వేటాడే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్‌కే హైలైట్ అని తెలుస్తోంది. ఇప్పటికే కర్నూల్, నంద్యాల జిల్లాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. ఈ గండికోట షెడ్యూల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఆరు రోజుల పాటు రాత్రింబవళ్లు జరిగే ఈ క్రేజీ షెడ్యూల్‌లో సినిమాకు ప్రాణమైన కొన్ని మైండ్ బ్లోయింగ్ కీ-సీన్స్ షూట్ చేయనున్నారు.
ఇక లొకేషన్ నుండి లీకైన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. గుర్రపు స్వారీ చేస్తూ విజయ్ కనిపిస్తున్న రగ్గడ్ అండ్ పవర్‌ఫుల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాహుల్ మార్క్ మేకింగ్, విజయ్ మాస్ స్వాగ్, రష్మిక గ్లామర్ కలగలిసి 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ఫ్యాన్స్, సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Grand Canyon of India Gandikota Maa Rayalaseema Ela anipinchindi anna @TheDeverakonda ❤️#VijayDevaraKonda #Ranabali https://t.co/NVMZTfLF9a pic.twitter.com/ALGkWAr9Fb
— Narasimha NTR 🦚 (@NarasimhaNTR_) June 2, 2026
