Ramayana OTT Release: 'రామాయణం'OTTలో చూడాలంటే అదనంగా డబ్బులు కట్టాల్సిందేనా? జియోహాట్‌స్టార్ బిగ్ షాక్!

Ramayana OTT Release: 'రామాయణం'OTTలో చూడాలంటే అదనంగా డబ్బులు కట్టాల్సిందేనా? జియోహాట్‌స్టార్ బిగ్ షాక్!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కుతున్న  చిత్రం 'రామాయణం'. భారీ అంచనాల మధ్య నవంబర్‌ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఈ మూవీ రిలీజ్ కానుంది.  బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం జియోహాట్‌స్టార్, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ చేతులు కలిపాయి. 

ఓటీటీలో కొత్త ప్రయోగం.. 

లేటెస్ట్ గా రామాయణం ఓటీటీ రిలీజ్ పై జియోహాట్‌స్టార్ కీలక ప్రకటన చేసింది.  ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో భాగస్వామ్యంలో భాగంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత.. భారత్‌లో జియోహాట్‌స్టార్ ద్వారా ప్రత్యేక ఆన్-డిమాండ్ కొనుగోలు విధానంలో అందుబాటులోకి రానుంది. అంటే సాధారణ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నంత మాత్రాన సినిమా చూసే అవకాశం ఉండకపోవచ్చు. వీక్షకులు ఈ చిత్రం కోసం విడిగా చెల్లించాల్సి ఉంటుంది. 

అయితే ఎంత ధర నిర్ణయిస్తారు? ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు? అనే విషయాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ భారత్‌లో ఒక్కో సినిమాకు విడిగా డబ్బులు చెల్లించి చూసే పే పర్ వ్యూ విధానానికి ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపై నెటిజన్లు నుంచి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు... ముఖ్యంగా భారీ అంచనాలున్న 'రామాయణం' కోసం అభిమానులు అదనంగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతారా? అన్నది చూడాలి.

గ్లోబల్ స్థాయిలో 'రామాయణం'..

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల లైవ్-యాక్షన్ ఇతిహాస చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్‌ఈజీ సంస్థ పనిచేస్తుండగా, సంగీతాన్ని హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

దీపావళికి థియేటర్లలో సందడి..

'రామాయణం: పార్ట్ వన్' నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో, ఐమాక్స్ 3డీ ఫార్మాట్‌లో విడుదల కానుంది. ముందుగా థియేటర్లలో భారీ విజువల్ అనుభూతిని అందించి, ఆ తర్వాత డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచస్థాయిలో ఆవిష్కరించాలనే లక్ష్యంతో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఓటీటీలో అదనపు చెల్లింపుల విధానం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కాలమే నిర్ణయించాలి.