వనపర్తి: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్ల వరకు రిపేరు రాకుండా రోడ్లు

వనపర్తి: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్ల వరకు రిపేరు రాకుండా రోడ్లు
  •     ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి 

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో వచ్చే 15 ఏండ్ల వరకు రిపేరు రాకుండా రోడ్లు నిర్మిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తికి వచ్చిన ఆయన రూ.359కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజీవ్​చౌక్‌‌‌‌లో కార్నర్​ మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ 2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.3వేల కోట్లతో అద్దాల్లాంటి రోడ్లు వేస్తామన్నారు. గ్రామ గ్రామాన రోడ్లు బాగున్నప్పుడే పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రోడ్లు వేయడమే కాకుండా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా పర్యవేక్షిస్తామన్నారు. ఏడాదికొకసారి కూడా ఫామ్​ హౌస్​ నుంచి బయటికి రాని వ్యక్తి తిరిగి సీఎం ఎలా అవుతాడని కేసీఆర్‌‌‌‌‌‌‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. 

సీఎం రేవంత్​రెడ్డి అహర్నిశలు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే సీఎం అవుతారన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ అహంకారానికి చెక్​ పెట్టి గత ఎన్నికల్లో మేఘారెడ్డిని గెలిపించారని, అయినా గత పాలకులకు ఇంకా అహం తగ్గలేదన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అసలు త్యాగం చేసింది జూపల్లి, కోమటిరెడ్డేనన్నారు. మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్పోర్ట్స్​ అథారిటి చైర్మన్‌‌‌‌ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్​రెడ్డి, కసిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి, వీర్లపల్లి శంకర్​పాల్గొన్నారు.