Dhurandhar 2: పాకిస్తాన్‌లో రణ్‌వీర్ సింగ్ క్రేజ్.. ‘ధురంధర్ 2’ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్!

 Dhurandhar 2: పాకిస్తాన్‌లో రణ్‌వీర్ సింగ్ క్రేజ్.. ‘ధురంధర్ 2’ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్!

బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge). ఈ చిత్రం థియేటర్లలోనే కాదు.. ఇప్పుడు ఓటీటీలోనూ తన రూలింగ్‌ను కంటిన్యూ చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం చూపించారు. అయితే, లేటెస్ట్ గా ఈ సినిమా పాకిస్తాన్ నెట్‌ఫ్లిక్స్‌లో సృష్టిస్తున్న విధ్వంసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సర్వర్లు డౌన్!

మే 14న ఈ చిత్రం అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. పాకిస్తాన్‌లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయిన కొన్ని నిమిషాలకే నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అయిపోయాయంటూ అక్కడి ప్రముఖ కంటెంట్ క్రియేటర్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.  పాకిస్తాన్‌లో 'ధురంధర్ 2' రిలీజ్ కాగానే నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. రాత్రి 12 గంటల కోసం జనాలు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. సినిమా అప్‌లోడ్ అవ్వడమే ఆలస్యం, అందరూ ఒకేసారి క్లిక్ చేయడంతో బఫరింగ్ సమస్యలు వచ్చాయి. మా వైఫై బాగానే ఉన్నా సినిమా ప్లే కాలేదు. రణ్‌వీర్ సింగ్ క్రేజ్ ఇక్కడ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు.

 

నెట్‌ఫ్లిక్స్‌లో నెంబర్ 1..

సినిమాలో చూపించిన కొన్ని సున్నితమైన అంశాలపై పాకిస్తాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో చూపించింది నిజమా, అబద్ధమా అనేది పక్కన పెడితే.. సినిమా ఎలా తీశారో చూడాలనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. లియారీ బ్యాక్‌డ్రాప్‌లో నిజంగానే అలా జరిగిందా లేదా అనేది తర్వాత చర్చించుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది అని క్రియేటర్ పేర్కొన్నారు.

 

ఇండియన్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

భారతదేశంలో ఈ సినిమా రిలీజ్ కోసం ఇక్కడి ఫ్యాన్స్  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ధురంధర్: ది రివెంజ్' భారతీయ డిజిటల్ ప్రీమియర్ జూన్ 4, 2026న జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ గ్రాండ్ రిలీజ్ కంటే ముందే ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ డిజిటల్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, నెట్‌ఫ్లిక్స్ అంతర్జాతీయంగా ఈ సినిమాకు సంబంధించిన 'రా అండ్ అన్‌కట్' (Raw and Uncut) వెర్షన్‌ను రిలీజ్ చేసింది.. రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీ, ఇప్పుడు సరిహద్దులు దాటి మరీ తన సత్తా చాటుతోంది.