ఓటీటీ డేట్ ఫిక్స్‌‌.. ఐపీఎల్‌‌ తర్వాతే.. ‘ధురంధర్: ది రివెంజ్‌‌’ OTTలోకి..

ఓటీటీ డేట్ ఫిక్స్‌‌.. ఐపీఎల్‌‌ తర్వాతే.. ‘ధురంధర్: ది రివెంజ్‌‌’ OTTలోకి..

రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ డ్రామా ‘ధురంధర్: ది రివెంజ్‌‌’ బాక్సాఫీస్‌‌ దగ్గర ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లు వసూలు చేసింది.  దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.  ఈ క్రమంలో శుక్రవారం జియో హాట్ స్టార్‌‌‌‌  సంస్థ స్ట్రీమింగ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేసింది. జూన్‌‌ 5 నుంచి జియోహాట్‌‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 4 న సాయంత్రం 7 గంటల నుంచి  గ్రాండ్ డిజిటల్ ప్రీమియర్ ఉండబోతోంది.

థియేటర్స్‌‌లో ఈ చిత్రం నిడివి 3 గంటల 49 నిమిషాలు కాగా, అదనంగా కొన్ని సీన్స్‌‌ యాడ్ చేసి 3 గంటల 52 నిమిషాల నిడివితో స్పెషల్ ఎక్స్‌‌టెండెడ్ ఎడిషన్‌‌గా దీనిని సిద్ధం చేశారు. హిందీతో పాటు తెలుగు,  తమిళ,  కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తోంది.  నిజానికి ఈ మూవీ గ్లోబల్ వెర్షన్‌‌ గురువారం నుంచి నెట్‌‌ ఫ్లిక్స్‌‌లో స్ట్రీమ్ అవుతోంది.  అయితే ఐపీఎల్‌‌ సీజన్‌‌ దృష్ట్యా జియో హాట్‌‌ స్టార్‌‌‌‌ ఈ సినిమాను ఆలస్యంగా స్ట్రీమింగ్‌‌కు తెస్తోంది.