ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్ట్‌లో అత్యంత అరుదైన కొంగలు దర్శనమిచ్చాయి. ప్రాజెక్ట్ పరిసరాల్లో ఆసియన్ వూలీ నెక్డ్ స్టార్క్ జాతికి చెందిన రెండు కొంగలు కనిపించడం ప్రకృతి ప్రేమికులను, పక్షి పరిశోధకులను ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. పచ్చటి చిత్తడి నేలలు, స్వచ్ఛమైన నీటి వనరులు, ప్రశాంతమైన వాతావరణం ఉన్నందునే ఈ పక్షులు ఇక్కడికి చేరుకున్నాయన్నారు. అరుదైన పక్షుల సంరక్షణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
