అనకొండ కాదు.. డూమ్స్ డే చేప : మన దగ్గర దొరకటం ప్రళయానికి సంకేతమా..? జపాన్ శాస్త్రం ఏం చెబుతోంది..?

అనకొండ కాదు.. డూమ్స్ డే చేప : మన దగ్గర దొరకటం ప్రళయానికి సంకేతమా..? జపాన్ శాస్త్రం ఏం చెబుతోంది..?

ఫొటోలు చూసి.. విజువల్స్ చూసి అనకొండ పాము అనుకుంటున్నారా ఇది.. కానేకాదు.. ఇది చేప. చాలా చాలా అరుదైన చేప. దీని పేరు డూమ్స్ డే ఫిష్ అంటారు.. దీని పొడవు 11 మీటర్ల వరకు ఉంటుంది.. ఇది సహజంగా సముద్ర తీరంలో దొరకదు.. సముద్రం లోతుల్లో ఉంటుంది. అలాంటి డూమ్స్ డే ఫిష్.. ఇప్పుడు తమిళనాడు మత్స్యకారుల వలకు చిక్కింది. అంతేకాదు.. గత రెండు వారాల్లో అంటే.. 2025, జూన్ నెలలోనే ఈ డూమ్స్ డే ఫిష్ లు నాలుగు దొరికాయి. తీరంలో చేపల వలలకు డూమ్స్ డే ఫిష్ దొరకటం అనేది ప్రకృతి వైపరీత్యాలకు.. ప్రకృతి బీభత్సాలకు సంకేతం అంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సముద్రంలో ఏదో జరగబోతున్నది అనే భయాలు నెలకొన్నాయి. 

డూమ్స్ డే ఫిష్ పై జపాన్ దేశంలో చాలా చాలా నమ్మకాలు ఉన్నాయి. సముద్రంలో భారీ భూకంపాలు, సునామీలు, తుఫానులు వచ్చే ముందు ఈ డూమ్స్ డే ఫిష్ లు తీరంలో కనిపిస్తాయని.. విపత్తులను ముందే గ్రహించే శక్తి ఉండటంతో.. ఇవి తీరం వైపు వస్తాయని బలంగా నమ్ముతారు. డూమ్స్ డే చేపలు సముద్రం లోతుల్లో.. సముద్రం అడుగు భాగంలో ఉంటాయని.. అలాంటి చేపలు తీరంలో సాధారణ మత్స్యకారులకు దొరకటం అనేది.. ప్రకృతి విపత్తలకు.. రాబోయే ప్రమాదాలకు సంకేతంగా భావిస్తున్నారు చాలా మంది. 

ఈ డూమ్స్ డే చేపలు భారతదేశంలో దొరకటం అనేది చాలా చాలా అరుదు అని.. అసలు భారత సముద్ర జలాల్లో ఇవి కనిపించవు అని.. అలాంటిది ఇప్పుడు దొరకటం ఏంటీ అనే ప్రశ్నలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ప్రళయానికి సంకేతం అంటూ జపాన్ శాస్త్రం చెబుతోంది. డూమ్స్ డే చేప అనేది చాలా చాలా నెమ్మదిగా కదులుతుంది.. సోమరిపోతు చేప అంటూ దీనికి మరో పేరు కూడా ఉంది. సముద్ర భూగర్భంలో ఉంటుంది ఇది.. పాచి తింటూ బతికేస్తుంది. దీనికి ప్రకృతిలో మార్పులను పసిగట్టే తెలివి ఉంది అని చెబుతారు జపనీయులు. 

తుఫానులు, భూకంపాలు, సునామీలు వంటివి వచ్చే ముందే.. ఇవి తీరం వైపు వస్తాయంట.. లేకపోతే అస్సలు రావంట.. ఇలాంటి డూమ్స్ డే చేపలు.. తమిళనాడు తీరంలోని మత్స్యకారులకు దొరకటం అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు నిపుణులు. ఇది ప్రళయానికి సంకేతమా అనే భయాలు స్థానికులను వెంటాడుతున్నాయి. మొత్తానికి డూమ్స్ డే చేప చూడటానికి అనకొండలా ఉన్నా.. ఇది చాలా చాలా సాఫ్ట్ చేప.. మనుషులను అస్సలు ఏమీ చేయదు..