RashmikaVijay: టోక్యో వీధుల్లో రష్మిక-విజయ్ జంట.. 'మౌంట్ ఫుజి' సాక్షిగా నేషనల్ క్రష్ క్రేజీ పోస్ట్‌ వైరల్!

RashmikaVijay: టోక్యో వీధుల్లో రష్మిక-విజయ్ జంట..  'మౌంట్ ఫుజి' సాక్షిగా నేషనల్ క్రష్ క్రేజీ పోస్ట్‌ వైరల్!

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.  లేటెస్ట్ గా ఈ రౌడీ స్టార్, నేషనల్ క్రష్ జపాన్ టూర్‌కి వెళ్లారు. అక్కడ టోక్యో వీధుల్లో వీరు దిగిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది జపాన్ ట్రిప్ ఎక్స్‌ట్రా ఫన్ ఇచ్చింది అంటూ రష్మిక షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

ఫుల్ జోష్ లో రష్మిక- విజయ్..

ఈ క్రేజీ వెకేషన్‌లో రష్మిక ట్రెడిషనల్ జపనీస్ 'యుకాతా'  డ్రెస్సులో మెరిసిపోతూ తన సిగ్నేచర్ స్మైల్‌తో ఫ్యాన్స్ మనసులు దోచుకుంది. అక్కడి అండర్‌గ్రౌండ్ డిజిటల్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో చిన్నపిల్లలా గెంతుతూ, ఫ్లఫీ జపనీస్ ప్యాన్‌కేక్స్ తింటూ, మచ్చా డ్రింక్ ఎంజాయ్ చేస్తూ సందడి చేసింది.  ప్రస్తుతం వీరి టూర్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

బ్యాక్‌డ్రాప్‌లో మౌంట్ ఫుజి.. 

ఈ ఫొటోలన్నింటిలోకి హైలైట్ ఏంటంటే.. అందమైన 'మౌంట్ ఫుజి' పర్వతం బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా, రష్మిక విజయ్‌ను ప్రేమగా పట్టుకుని దిగిన రొమాంటిక్ పిక్. టోక్యో నైట్ లైట్‌లో విజయ్ నడుచుకుంటూ వెళ్తున్న బ్లర్ పిక్స్ కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. అంతేకాదు, రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో విజయ్ మెడలో 'R' (రష్మిక) అనే అక్షరంతో ఉన్న లాకెట్ కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు.

సీక్రెట్ లవ్ టు గ్రాండ్ వెడ్డింగ్

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన ఈ జంట, చాలా ఏళ్లపాటు తమ లవ్ స్టోరీని సీక్రెట్‌గా ఉంచారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ స్టార్స్ హాజరై సందడి చేశారు.

రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్

పెళ్లి తర్వాత ఈ రియల్ లైఫ్ జోడీ మళ్లీ రీల్ లైఫ్‌లో సందడి చేయబోతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 1854 - 1878 నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'రణబలి' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. దీంతో పాటు విజయ్ 'VDxశౌర్యువ్' ప్రాజెక్ట్‌తో, రష్మిక 'కాక్‌టైల్ 2', 'మైసా' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈ రియల్ లైఫ్ జోడీ ఇటు పర్సనల్ లైఫ్‌ను, అటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఫుల్ స్వింగ్‌లో ఎంజాయ్ చేస్తోంది..