నా ప్రతీ పనిలో తను ఉన్నాడు.. ఫస్ట్ టైమ్ విజయ్ గురించి చెప్పిన రష్మిక

నా ప్రతీ పనిలో తను ఉన్నాడు.. ఫస్ట్ టైమ్ విజయ్ గురించి చెప్పిన రష్మిక

యానిమల్(Animal) సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. గీతాంజలి పాత్రలో ఆమె నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో బాలీవుడ్ నుండి వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు రష్మిక. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తాను వర్క్ చేసిన యాక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

వారిలో అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా అమితాబ్ గురించి మాట్లాడిన రష్మిక.. అమితాబ్‌ సర్‌ అందరితో చాలా సరదాగా ఉంటారు. వయసుతో సంబందం లేకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు. ఇక రణ్బీర్ విషయానికి వస్తే ఆయన చాలా స్పోర్టీవ్‌గా ఉంటారు. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని ఇచ్చారు రణ్బీర్. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. జీవితంలో నేను చేసే ప్రతి పనిలో విజయ్‌ సహకారం ఉంటుంది. ఏ పని చేయాలన్నా అతని సలహా తీసుకుంటాను. అది నాకు అవసరం కూడా. ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడు. నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్‌ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయ్.. అని చెప్పుకొచ్చారు రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమా తరువాత హిందీలో చావా, తమిళం లో ధనుష్ సినిమా, ది గర్ల్ ఫ్రెండ్, సినిమాలు చేస్తోంది.