రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం కేరళలో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ జరుగుతోంది. 15 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కేచా ఖంపక్దీ మాస్టర్ హై వోల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్‌గా ఉండబోతుందని అన్నారు. ఇందులో గోండు గిరిజన తెగకు చెందిన పవర్‌ఫుల్ ఉమెన్‌గా రష్మిక కనిపించనుంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్‌తో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం.
దీనికోసం అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంది. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రష్మిక క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్.

