టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (ViRosh) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. పెళ్లి తర్వాత వీరు నటించిన మొదటి మైలురాయి చిత్రం 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. వెండితెరపై తమ కెమిస్ట్రీతో అభిమానులను ఫిదా చేసిన ఈ జంట అభిమానులను కలుస్తూ ఫ్యాన్స్ లో మరింత హుషారును నింపుతున్నారు. మరోవైపు పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ Season 9' లో తమ రొమాంటిక్ కెమిస్ట్రీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' జోరు..
1800ల మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో, బ్రిటిష్ పాలన నాటి కృత్రిమ కరువు ఆధారంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఇందులో రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక తమ నటనతో పరకాయ ప్రవేశం చేశారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత హ్యాట్రిక్ కాంబోగా అక్టోబర్ 16న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దేశభక్తి నిండిన పాత్రలో విజయ్ మేకోవర్, నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సరికొత్త సవాళ్లతో..
కథానాయకుడిగా విజయ్ తన ఇమేజ్ కు పరిమితం కాకుండా, నటుడిగా సరికొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారన్న 'రణబాలి' మూవీ మరోసారి స్పష్టం చేస్తోంది. ఇందులో తన పాత్ర కోసం ఆయన చూపించిన డేడికేషన్, శైలి ఆకట్టుకునేలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోందంటున్నారు.
రష్మికమే పెళ్లి ప్రపోజల్..
ఈ బ్లాక్‌బస్టర్ విజయం నడుమ, జియోహాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే 'కాఫీ విత్ కరణ్ 9' రెండవ ఎపిసోడ్‌లో ఈ రియల్ లైఫ్ జోడీ సందడి చేసింది. ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్ వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ మధ్య ఎలాంటి సాంప్రదాయ ప్రపోజల్ జరగలేదని, రష్మికయే తనను పెళ్లి చేసుకోమని ఏడాది పాటు దాదాపు 100 సార్లు అడిగిందని విజయ్ సరదాగా వెల్లడించారు.
ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ..
విజయ్‌కి వేరే ఏ హీరోయిన్‌తో బెస్ట్ కెమిస్ట్రీ ఉందన్న కరణ్ ప్రశ్నకు 'ఎవ్వరితోనూ లేదు' అని రష్మిక స్పాట్‌లోనే పంచ్ వేసింది. దీనికి విజయ్ నవ్వుతూ"హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్.. పెళ్ళాం చెప్పినదానికి ఎప్పుడూ ఓకే అనడమే!" బెస్ట్ అని సరదాగా చెప్పారు. రాపిడ్ ఫైర్‌లో అల్లు అర్జున్, రణబీర్ కపూర్లలో బన్నీకే రష్మిక ఓటు వేసింది. ఇక గేమింగ్ రౌండ్‌లో ఐకానిక్ డైలాగ్ కోసం విజయ్ స్వయంగా అల్లు అర్జున్‌కు కాల్ చేయడం విశేషం.
బతుకమ్మ వేడుకల్లో హంగామా..
ఇక హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఈ నూతన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి తర్వాత రష్మికకు ఇది తొలి బతుకమ్మ కావడం, సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట చేసిన సందడి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రష్మిక 'మైసా', 'రాకా'చిత్రాలతో... విజయ్ 'రౌడీ జనార్దన'తో బిజీగా ఉన్నప్పటికీ.. 'రణబాలి' విజయం, విరోష్ ఆన్-స్క్రీన్ రొమాన్స్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది..
