లెజెండరీ సింగర్ బయోపియాక్ లో రష్మిక..!

లెజెండరీ సింగర్ బయోపియాక్ లో రష్మిక..!

ఓ వైపు స్టార్ హీరోలకు జంటగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే.. మరోవైపు 'మైసా' లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. రష్మిక మందన్న. తాజాగా ఆమె ఓ బయోపిక్ లో నటించ బోతోందని సమాచారం. లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథతో 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తి న్ననూరి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించబోతున్నారు.

స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, సెట్కు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అయితే ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. లీడ్ రోల్లో సాయిపల్లవిని అనుకున్నారు. 'రామాయణ' సహా ఇతర చిత్రాలతో ఆమె బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఆ తర్వాత రుక్మిణి వసంత్ పేరు తెరపైకొచ్చినా అది ప్రచారంగా నేమిగిలింది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ రష్మిక దగ్గరకు వచ్చింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇటీవల ఆమెను కలిసి స్టోరీవినిపించినట్టు సమాచారం. 

ఈ బయో పిక్కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఛాలెంజింగ్ క్యారెక్టర్ కనుక ఓకే చెప్పే అవకాశా లు లేకపోలేదు. సెప్టెంబర్ 16న సుబ్బులక్ష్మి జయంతి కావడంతో ఆరోజు ఈ సినిమా గురించి మరింత క్లారిటీ రానుంది.