షోలో చూసి అలా జెడ్జ్ చేయకండి.. ఎలిమినేషన్ తరువాత రతిక ఫస్ట్ రియాక్షన్

షోలో చూసి అలా జెడ్జ్ చేయకండి.. ఎలిమినేషన్ తరువాత రతిక ఫస్ట్ రియాక్షన్

బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season7) నుండి హాట్ బ్యూటీ ఎలిమినేట్ అయిపోయింది. తన అందంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన రతిక(Rathika).. ఆటతో మాత్రం అలరించలేకపోయింది. నాలుగో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మొదటివారంలో ఈమె ఆట చూసి చాలా మంది ఫైనల్ వరకు ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఆతరువాత ఆమె ఆట గాడితప్పింది. ఇక తన ఎలిమినేషన్ ను ఊహించని రతిక స్టేజిపై కన్నీళ్లు పెట్టుకుంది. బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అది ఎపిసోడ్ చూసిన వాళ్లకి క్లియర్ గా అర్థమైంది. 

ఇక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక తన ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది రతిక. ఈమేరకు తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.. అందరికి థాంక్యూ.. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్.. దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ యూ సా(షోలో నన్ను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. హౌసులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది).. అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ బట్టి చూస్తే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు ఈమె ఫీలవుతుందని అర్థమవుతోంది. మరి తనకు ఎం అన్యాయం జరిగింది, దానికి ఎలా జనాల్లోకి తీసుకెళ్తుందో చూడాలి.