త్రేతా యుగంలో రామ రావణ యుద్దంలో ఆశ్వయుజ శుద్ద దశమి రోజున లంకాధిపతి రావణాసురుడిని శ్రీరామచంద్రుడు అంతమొందించాడు. యుద్దంలో శ్రీరాముని చేతితో వీరమరణం పొందిన రావణాసురుని కుమారులు కూడా యుద్దంలో లంకాధిపతి కంటే ముందుగానే వీర మరణం పొందారు. ఈ సమయంలో రావణాసురునికి అంత్యక్రియలు ఎవరు నిర్వహించారు.. విభీషణుడు ఎందుకు సంకోచించాడు.. రామణుడి అంత్యక్రియల్లో రాముడి పాత్ర ఏమిటి.. ఎప్పుడు నిర్వహించారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రామ.. రావణుల మధ్య భీకర యుద్దం జరిగింది. ఈ యుద్దంలో రావణాసురుడు మరణించాడు.అప్పటి నుంచి సీతాదేవి అపహరణ, రావణుడి వధ, శ్రీరాముడి విజయగాథ ఎంతో ప్రసిద్ధి చెందాయి. లంకను పాలించిన రావణుడి చివరి సంస్కారాల విషయంలో శ్రీరామచంద్రుడి పాత్ర చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. రావణాసురుడి అంత్యక్రియలు ఆశ్వయుజమాసం శుద్ద ఏకాదశి రోజు జరిగాయి. అయితే అంత్యక్రియలను నిర్వహించేందుకు అతని తమ్ముడు విభీషణుడు నిరాకరించాడు. కాని శ్రీరాముని ఆదేశాలతోనే రావణాసురుని అంత్యక్రియలను విభీషణుడు నిర్వహించాడని పండితులు చెబుతున్నారు.
అధర్మంతో సీతాదేవిని అపహరించి.. రావణాసురుని రాక్షస చర్యలను మొదటి నుంచి విభీషణుడు వ్యతిరేకించేవాడు. అయినా సరే తన అన్న గారి మరణాన్ని విభీషణుడు తట్టుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో అన్నయ్యకు అంత్యక్రియలు నిర్వహించడానికి అతడు తొలుత సంకోచించినట్లు రామాయణ గాథ చెబుతుంది.
విభీషణుని పరిస్థితిని అర్దం చేసుకున్న శ్రీరామచంద్రుడు మరణించిన వారిపట్ల శతృత్వం ఉండకూడదని వివరిస్తూ.. ఆ సమయంలో అతను చేయాల్సిన ధర్మం గురించి చెప్పాడు. మరణించిన వారు ఉత్తమలోకాలు పొందేందుకు వీలుగా కర్మలు చేయడం అనేది కుటుంబ సభ్యుల బాధ్యత అని వివరించాడు.
లక్ష్మణుడిని విభీషణుడి వద్దకు పంపించి, రావణుడి అంత్యక్రియలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాడు. శ్రీరాముడి మాటలను అంగీకరించిన విభీషణుడు తన అన్నయ్యకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను ఆశ్వయుజ శుద్ద ఏకాదశి రోజున నిర్వహించాడు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
