వినూత్న కథతో రేవ్ పార్టీ.. రిలీజ్కు సిద్ధం

వినూత్న కథతో రేవ్ పార్టీ.. రిలీజ్కు సిద్ధం

క్రిష్ సిద్ధిపల్లి(Krish siddipalli), రితిక చక్రవర్తి(Rithika Chakravarthy) జంటగా, రాజు బొనగాని(Raju Bonagani) రూపొందిస్తున్న చిత్రం రేవ్ పార్టీ(Rave Party). ఇప్పటికే షూటింగ్‌‌‌‌ పూర్తయిన ఈ చిత్రం  త్వరలోనే సెన్సార్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతోంది. శనివారం హీరో క్రిష్‌‌‌‌ సిద్ధిపల్లి పుట్టినరోజు. సినిమాలపై ప్యాషన్‌‌‌‌తో ‘క్షణం’ చిత్రానికి అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, గూఢచారి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన క్రిష్.. ఈ చిత్రంతో హీరోగానూ మెప్పించబోతున్నాడని చిత్రయూనిట్‌‌‌‌ శుభాకాంక్షలు తెలిపారు.

యువతకు నచ్చేలా వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, రేవ్‌‌‌‌ పార్టీలు ఎక్కువగా జరిగే మైసూర్, ఉడిపి, గోవా, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు. అలాగే రేవ్ పార్టీలు ఎలా జరుగుతాయి. వాటి వెనుక ఎవరెవరు ఉంటారు. వాటి వల్ల యువతకు జరిగే నష్టం ఏమిటనేది క్లియర్‌‌‌‌‌‌‌‌గా చూపించామని, త్వరలో పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.