ఫిల్మ్ మేకర్‌గా, నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న రవిబాబు.. ఓ ఎక్సయిటింగ్ ప్రాజెక్టును రూపొందిస్తున్నాడు. ‘రేజర్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ నిర్మిస్తోంది. దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోస్టర్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
గ్లింప్స్‌లో రవిబాబు వైలెంట్‌గా కనిపించాడు. కారు ఇంజిన్ వాల్వ్ కవర్‌తో విలన్‌ను హతమార్చే సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్‌ఎస్ రాజేశ్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలకు సతీష్ పోలోజు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ వేసవిలో సినిమా విడుదల కానుందని ప్రకటించారు. రవిబాబు, సురేష్ బాబు కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
