రౌడీల్ని పరిగెత్తించి కొడుతున్న మాస్ క్రాకర్ రవితేజ

రౌడీల్ని పరిగెత్తించి కొడుతున్న మాస్ క్రాకర్ రవితేజ

మాస్‌‌‌‌‌‌‌‌కి కేరాఫ్ అయిన రవితేజ సినిమా వస్తోందంటే మాంచి ధమాకాని ఎక్స్‌‌‌‌‌‌‌‌పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అందుకేనేమో.. దాన్నే టైటిల్‌‌‌‌‌‌‌‌గా పెట్టి సినిమా తీస్తున్నాడు నక్కిన త్రినాథరావు. వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ‘ధమాకా’ మూవీ నుంచి మూడు రోజులు ముందుగానే ప్రేక్షకులకు టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో దీపావళి కానుక అందింది. యాక్షన్, కామెడీ కలగలిసిన ఈ మాస్ క్రాకర్ రవితేజ మార్క్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌తో మస్త్ మస్త్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ‘నేను నీలో విలన్‌‌‌‌‌‌‌‌ని చూస్తే.. నువ్వు నాలో ఒక హీరోని చూస్తావ్. కానీ యాక్షన్‌‌‌‌‌‌‌‌లోకి దిగానంటే నేనో శాడిస్ట్‌‌‌‌‌‌‌‌ని’ అంటూ ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌‌‌‌‌గా డైలాగ్‌‌‌‌‌‌‌‌ చెప్పిన రవితేజ.. రౌడీల్ని పరిగెత్తించి కొడుతున్నాడు.

‘నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా’ అని సత్యం రాజేష్ అడిగితే.. ‘అంబులెన్స్ వేసుకుని డ్రైవరొస్తాడు’ అంటూ ఫన్నీ పంచ్‌‌‌‌‌‌‌‌ వేసి నవ్వించాడు. ‘అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే’ అంటూ విలన్‌‌‌‌‌‌‌‌కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మొత్తంగా టైటిల్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టే ఈ సినిమా సూపర్బ్‌‌‌‌‌‌‌‌గా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేయనుందనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది. శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 23న సినిమాని విడుదల చేయనున్నట్టు కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు.