న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా పూనకాలు లోడింగ్ సాంగ్ రిలీజ్

న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా  పూనకాలు లోడింగ్ సాంగ్ రిలీజ్

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అంచనాలు పెంచుతున్నాయి. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి ‘పూనకాలు లోడింగ్’ అంటూ ఊరిస్తున్న టీమ్, ఆ పల్లవితో రాబోతున్న పాటను న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా ఈనెల 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిన్న ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్‌‌‌‌గా చూస్తూ, డ్యాన్స్ చేస్తున్నారు.  బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో జాతర సందడి కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటతో అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అంటున్నారు మేకర్స్. వీరయ్యగా మాస్‌‌‌‌ క్యారెక్టర్‌‌లో చిరంజీవి, పోలీస్‌‌‌‌గా రవితేజ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అదే డేట్‌‌‌‌కి హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా హిందీ వెర్షన్ టీజర్‌‌‌‌‌‌‌‌ను కూడా విడుదల చేశారు.