‘వాల్తేరు వీరయ్య’లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న రవితేజ

‘వాల్తేరు వీరయ్య’లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న రవితేజ

రవితేజకు చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. సోమవారం రవితేజ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నట్టు  మొదటి నుండి వార్తలొచ్చాయి. అది నిజమే అన్నట్లుగా  ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేసి అఫీషియల్‌‌‌‌‌‌‌‌గా  ప్రకటించారు. ‘వాల్తేరు వీరయ్య’లో విక్రమ్ సాగర్ ఏసీపీ పాత్రలో రవితేజ  కనిపించబోతున్నాడు. ‘ఫస్ట్ టైమ్ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో రవితేజ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ‘గెట్ రెడీ ఫర్‌‌‌‌‌‌‌‌ మెగా మాస్ యాక్షన్ ఫెస్టివల్’ అంటూ  క్యాప్షన్ కూడా ఇచ్చారు. 

విలన్స్‌‌‌‌‌‌‌‌ను కొడుతూ కంప్లీట్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న రవితేజ..  ఓ చేతిలో మేకపిల్లను పట్టుకుని, మరో చేత్తో గొడ్డలితో గ్యాస్ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాగుతూ స్టైలిష్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ‘ఏమీ రా వారి.. పిస పిస చేస్తున్నవ్. నీకింకా సమజ్ కాలే, నేను ఎవ్వని అయ్యకు విననని..’ అంటూ తెలంగాణ యాసలో రవితేజ డైలాగ్స్ చెప్పడం సినిమాపై మరింత ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌ నటిస్తోన్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.