ఇటీవల ‘ఇరుముడి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా ఒకటి. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా టైటిల్‌ను ప్రకటిస్తూ మేకర్స్ వినూత్నంగా రూపొందించిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోను విడుదల చేశారు. ఇందులో రవితేజ ‘మాస్ మహారాజా’ నుంచి ‘క్రైమ్ మహారాజా’గా సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారని, టైటిల్ ఎంపిక వెనుక జరిగిన సరదా సంభాషణలను చూపించిన డాక్యుమెంటరీ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఫైనల్‌గా ఈ చిత్రానికి ముందునుంచి ప్రచారంలో ఉన్న ‘తులాభారం’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఈ వీడియోలో సినిమాలోని కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్, సౌండ్‌గా అనస్వర రాజన్, జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ కనిపించనున్నట్టు రివీల్ చేశారు.
పూజా కార్యక్రమం అనంతరం వీవీ వినాయక్ టీమ్‌కు స్క్రిప్ట్‌ను అందజేయగా, శ్రీవిష్ణు క్లాప్ కొట్టాడు. దర్శకులు శివ నిర్వాణ, బాబీ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. చందు కెమెరా స్విచాన్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
