రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ట్రైలర్ ట్రీట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 12న భీమవరంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు.
ఒకవైపు నోటిలో కత్తితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన భక్తుడిగా కనిపిస్తున్నారు. ఇందులో డివైన్ ఎలిమెంట్స్‌తోపాటు తండ్రికూతుళ్ల మధ్య బాండింగ్‌ను చూపించనున్నట్టు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా రివీల్ చేశారు. ఈ చిత్రంలో రవితేజను ఇప్పటివరకు చూడని డిఫరెంట్ వెర్షన్లో చూస్తారని మేకర్స్ తెలియజేశారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 21న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
