రవితేజ సినిమా టైటిల్ మారింది.. కారణం ఏంటి?

రవితేజ సినిమా టైటిల్ మారింది..  కారణం ఏంటి?

మాస్ మహారాజ్ రవితేజ(RaviTeja) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే టైగర్ నాగ్వశ్వర రావుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. యావరేజ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టారు రవితేజ. ప్రస్తుతం ఆయన ఈగల్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న ఈ సినిమా.. ఆ రేస్ నుండి తప్పుకుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈగల్ మూవీ టైటిల్ మారింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన ఆడియన్స్ రిలీజ్ ముందు టైటిల్ మారడం ఏంటి అని అనుకున్నారు. అయితే ఈగల్ టైటిల్ మారింది నిజమే కానీ.. అన్ని భాషల్లో కాదు కేవలం హిందీలో మాత్రమే. హిందీలో ఈ సినిమాకు సహదేవ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈగల్ అనేది అన్ని భాషల్లో కలిపి ఒకే మీనింగ్ వస్తుందని పెట్టారు. అయినప్పటికీ.. టైటిల్ చేశారంటే దానికి పెద్ద రీజనే ఉంది ఉంటుందని తెలుస్తుందో కానీ.. పర్ఫెక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. 

ఇక రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన నుండి వచ్చిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. దీంతో ఈగల్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది కాబట్టి ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మరి ఆ అంచనాలు ఈగల్ రీచ్ అవుతుందా అనేది చూడాలి.