
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. రీసెంట్‌గా తన 76వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. రవితేజతో పాటు ఇతర ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కిషోర్ తెలియజేశాడు. ఈ చిత్రం కోసం రవితేజ స్టైలిష్‌గా మేకోవర్ అయ్యాడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది.