మాస్ కాంబో రిపీట్.. మిస్టర్ బచ్చన్గా వస్తున్న మాస్ మహారాజ్

మాస్ కాంబో రిపీట్.. మిస్టర్ బచ్చన్గా వస్తున్న మాస్ మహారాజ్

మాస్ మహరాజా రవితేజ(Raviteja) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఒకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈగల్(Eagle) సినిమా చేస్తున్న రవితేజ.. ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. అది కూడా మిరపకాయ్ లాంటో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్(Harish Shankar) తో. అవును ఈ కాంబో ముచ్చటగా మూడోసారి జతకట్టనున్నారు. తాజాగా ఈ క్రేజీ కాంబోకి సంబందించిన మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఈ  సినిమాకు మిస్టర్ బచ్చన్(Mr Bachchan) అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాలో రవితేజ లుక్ ను రివీల్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్ 17 ఆదివారం రోజున జరిగాయి. 

ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. ఆ కారణంగా ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. అందులో  ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దాంతో రవితేజ తో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు హరీష్ శంకర్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది సమాచారం. చాలా ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. 

నిజానికి రవితేజ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. మిరపకాయ్ లాంటి సినిమా కావాలంటూ హరీష్ శంకర్ కు సైతం మెసేజెస్ పట్టారు. ఫైనల్ ఇంతకాలానికి వాళ్ళ ఆశలు నెరవేరుతున్నాయి. ఈ సినిమా కూడా మిరపకాయ్ రేంజ్ లో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని సమాచారం.