మాస్ మహారాజ్ రవితేజ టైగర్‌ నాగేశ్వరావు ట్రైలర్ రిలీజ్..

మాస్ మహారాజ్ రవితేజ  టైగర్‌ నాగేశ్వరావు  ట్రైలర్ రిలీజ్..

మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న పాన్ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వరావు(Tiger nageswararao). ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పేరుతెచ్చుకున్న గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ట్రైలర్ విషయానికి వస్తే..

దొంగతనాలు చేసే ప్రదేశాల కోసం స్టువర్టుపురంలో వేలంపాటతో ట్రైలర్ మొదలైంది. కరడు గట్టిన గజదొంగగా రవితేజ మాస్ అదరగొట్టారు. కొట్టే ముందు.. కొట్టేసే ముందు.. వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు.. కొలతలు బాగున్నాయి.. మగజాతి మొత్తం కొలతలే చూస్తారు.. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు అనే డైలాగ్స్ ట్రైలర్ లో పేలిపోయాయి. ప్రతీ ఫ్రేమ్ చాలా ఫ్రెష్‌గా, రస్టిక్ గా ఉన్నాయి.

జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ వచ్చేలా ఉంది. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అదిరిపోయాయి. రవితేజ లుక్స్, డైలాగ్స్, స్వాగ్, ఆ మేనరిజమ్ నెవెర్ బిఫోర్ అన్నట్టుగా ఉన్నాయి. రవితేజ కెరీర్లోనే ఈ సినిమా మరో మైలురాయిగా నిలుస్తుంది.

ట్రైలర్ తోనే మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించిన రవితేజ..సినిమాతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేస్తాడని సినీ క్రిటిక్స్ చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌ రిలీజ్తో ఆ అంచనాలను మరింత పెంచేలా చేశారు డైరెక్టర్.

అంతేకాకుండా టైగర్‌ నాగేశ్వరావు లో నటించిన ఆర్టిస్టుల పోస్టర్స్ను మరింత ఇంట్రస్టింగ్గా క్రియేట్ చేశారు. రోజుకు ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఆడియన్స్లో బజ్ క్రీయేట్ చేస్తున్నారు. పీరియాడిక్‌ అండ్ రియల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్‌ వంశీ డైరెక్ట్ చేస్తున్నారు.

అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా..అనుపమ్ ఖేర్,మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. 

టైగర్ నాగేశ్వరావు సినిమాకు పోటీగా బాలయ్య బాబు భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో, కన్నడ స్టార్ శివన్న ఘోస్ట్ మూవీస్ పోటీలో ఉన్నాయి. ఈ మూవీస్ అన్నింటి పైనా సినీ ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఉండగా..మరి ఏ సినిమా థియేటర్స్ లో రచ్చ చేస్తుందో చూడాలి మరి.