రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 8.
ఖాళీలు: 650. (అసిస్టెంట్)
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.
కంప్యూటర్లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఉండాలి.
రాష్ట్ర/ రిక్రూటింగ్ కార్యాలయ స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
మాజీ సైనికులకు కనీసం 15 సంవత్సరాల రక్షణ సేవ లేదా మాజీ సైనికులుగా గుర్తింపు పొంది ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు రూ.50. ఆర్బీఐ స్టాఫ్కు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మార్చి 8.
సెలెక్షన్ ప్రాసెస్
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
మెయిన్ ఎగ్జామినేషన్: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. 135 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్పీటీ): ఇది కనీస అర్హత పరీక్ష మాత్రమే. రాష్ట్ర/ స్థానిక భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు.
తుది ఎంపిక మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
పూర్తి వివరాలకు www.rbi.org.in వెబ్సైట్ను సందర్శించండి.
