Allu Arjun: ఇండియన్ సినిమా, క్రికెట్ ప్రపంచాల కలయిక ఎప్పుడూ అభిమానులకు ఒక పెద్ద పండగే.. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఒకరినొకరు కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక హార్ట్‌వార్మింగ్ పోస్ట్‌ను బన్నీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
అల్లు అయాన్‌కు ఆర్సీబీ జెర్సీ గిఫ్ట్:
ఈ సమావేశంలో వెంకటేష్ అయ్యర్ ఒక స్వీట్ జెస్టర్‌తో అల్లు ఫ్యామిలీని ఖుషీ చేశాడు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం ప్రత్యేకంగా ఒక ఆర్‌సీబీ (RCB) జెర్సీని కానుకగా అందించాడు. ఈ క్రేజీ గిఫ్ట్ ఇచ్చినందుకు అయ్యర్‌కు అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఈ స్టార్ క్రికెటర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ తెలియజేశాడు.
►ALSO READ | తమిళనాడు సీఎం విజయ్‌కు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. నెట్టింట ఫోటోలు వైరల్!
'రాకా' మూవీతో అల్లు అర్జున్ బిజీ:
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’ (Raaka) షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది (2027) భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతుంది.
It was a pleasure meeting talented young Indian cricketer @venkateshiyer garu today.
— Allu Arjun (@alluarjun) May 23, 2026
Special thanks to him for gifting #AlluAyaan a special signed jersey.
Wishing you all the very best for your future endeavours. Warm regards 🖤 pic.twitter.com/ME8w1CVSgp
