ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గ్రాండ్ విక్టరీ కొడితే.. ఆ గెలుపు సంబరాల్లో బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా ఊహించని విధంగా ఒక క్రేజీ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్‌సీబీ విన్నింగ్ మూమెంట్‌ను టీవీలో చూస్తూ ఆమె ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన కొన్ని 'వింత శబ్దాలు' (Unusual Sounds) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొందరు ఆ శబ్దం అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. అంతే కాదు నెటిజన్లు ఆ సౌండ్స్‌పై రకరకాల కామెంట్లు చేస్తూ, ట్రోలింగ్‌తో రచ్చ రచ్చ చేశారు.
ఇంత రచ్చ చేస్తారా?
ఈ వివాదం ముదిరిపోవడంతో ఎట్టకేలకు నుష్రత్ భరుచ్చా స్వయంగా రంగంలోకి దిగి గట్టి క్లారిటీ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటో చెప్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించింది. కొంతమంది మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల (Puppy) ఏడుస్తున్న సౌండ్ వస్తే.. దాన్ని పట్టుకుని ఇంత రచ్చ చేస్తారా? అంతటితో ఆగకుండా నా పేరుతో ఎవరో ఒక ఫేక్ క్లారిఫికేషన్ నోట్ కూడా వదిలారు. అందుకే అసలు నిజం ఏంటో నేనే చెప్తున్నా అంటూ నుష్రత్ ఫైర్ అయింది.
అసలేం జరిగిందంటే..?
నుష్రత్ తన ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని ఆర్‌సీబీ మ్యాచ్ చూసిందట. అక్కడ ఉన్న ఒక చిన్న పప్పీ ఆ సమయంలో గట్టిగా అరుస్తూ ఏడ్చింది. ఆ సౌండే వీడియోలో రికార్డ్ అయింది. నెటిజన్ల అనుమానాలకు చెక్ పెడుతూ, అదే సమయంలో తన ఫ్రెండ్ మరో యాంగిల్ నుండి తీసిన వీడియోను కూడా ప్రూఫ్‌గా షేర్ చేసింది నుష్రత్. నా పప్పీ అరిస్తే ఇంత గందరగోళం చేస్తారా? అంటూ ట్రోలర్ల నోళ్లు మూయించింది.
వివాదానికి ఫుల్ స్టాప్..
నిజానికి ఆర్‌సీబీ ఐపీఎల్ కప్ గెలవడంతో సోషల్ మీడియా అంతా ఆ సెలబ్రేషన్స్ తో ఊగిపోతోంది. ఇలాంటి టైంలో సెలబ్రిటీల రియాక్షన్స్ పై అందరి కళ్లూ ఉంటాయి. అదే నుష్రత్ పాలిట శాపమైంది. ఒక చిన్న కుక్కపిల్ల అరుపులను కొందరు కావాలనే తప్పుడు కోణంలో వైరల్ చేసి సోషల్ మీడియాను హీటెక్కించారు. ఏదేమైనా, నుష్రత్ ఇచ్చిన ఈ క్రేజీ అండ్ బోల్డ్ క్లారిఫికేషన్‌తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. సోషల్ మీడియాలో ఏదైనా ఎంత త్వరగా వక్రీకరించబడుతుందో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#NushrrattBharuccha clarifies
— Always Bollywood (@AlwaysBollywood) June 4, 2026
on her 'moaning, slaping' viral RCB celebration video, days it's her car which was moaning 🫢
"Guys, Calm Down… That voice is NOT mine. That was my Pussy cat voice, and I genuinely didn't notice it while posting. It got uploaded by mistake. The… pic.twitter.com/FwIsTE1hzu
