బడ్జెట్ ప్రైజ్ లో రియల్మీ ఫోన్

బడ్జెట్ ప్రైజ్ లో రియల్మీ ఫోన్

బడ్జెట్ ప్రైజ్ రేంజ్ లో రియల్మీ 10 4జీని లాంచ్ జనవరి 9న చేయబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్లని, స్పెసిఫికేషన్స్ ని ఫ్లిప్ కార్ట్ లో ఉంచింది. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో రాబోతుంది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. లైట్ పార్టికల్ స్పెషల్ డిజైన్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది.

50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా,16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి, 33 వాట్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13, రియల్మీ యూ.ఐ.4.0తో విడుదల అవుతుంది. 8 జీబీ ర్యామ్, 12 8 జీబీ మెమరీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీతో రాబోతుంది. 8+8  ర్యామ్ ఎక్స్ టెండ్ అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంటర్నల్ మెమరీనే ర్యామ్ గా ఎక్స్ పాండ్ చేయొచ్చు. ఈ ఫోన్ డిజైన్, లుక్ ఇంకా బయటికి రాలేదు.