
సీ 53 పేరుతో రియల్‌మీ ఇండియా మార్కెట్లో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా, 90 హెజ్ రిఫ్రెష్ రేట్ వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12జీబీ వరకు విస్తరించవచ్చు. రియల్‌మీ సీ53 బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.9,999 కాగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ మోడల్ ధర రూ. 10,999. ఈ నెల 26 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.