
హైటెక్ యుగంలో బిజీ లైఫ్.. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు. ఆఫీసు బీజీ.. వర్క్ బిజీ.. ఇలా పొద్దున పోతే రాత్రికి వచ్చి బెడ్ ఎక్కడం .. ఇలా సాగిపోతుంది. ఇక పిల్లలతో కాస్త మాటా.. ముచ్చటి పంచుకొనే టైమే ఉండదు. ఇక హాలిడే వచ్చిందా అంటూ ఫ్రెండ్స్.. షికార్లు అని రోడ్డు పట్టుకొని తిరుగుతారు.. కనీసం హాలిడే రోజు కూడా పిల్లలతో టైంస్పెండ్ చేయకుండా.. షేరింగ్ లేకపోతే తరువాత రోజుల్లో తండ్రులు కూడా అలాంటి ఇబ్బందే ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు జరిసిన పరిశోధనలో తేలింది. ఇప్పడు దాని గురించి డిటైల్డ్‌గా తెలుసుకుందాం. . .
ప్రభాకర్ గారికి బీటెక్ చదువుతున్న కూతురు ఉంది. నా కూతురు నాతో అన్ని పంచుకోవాలి. నేను తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. మా ఇద్దరి మధ్య అనుబంధం ఆకాశమంత సినిమాలో ప్రకాశ్‌రాజ్.. త్రిషలాగా ఉండాలి' అని అనుకుంటాడాయన. కానీ, ఆమె మాత్రం ప్రభాకర్ గారిని జస్ట్ మామూలు నాన్నలాగే చూస్తుంది. ఏదైనా అవసరం ఉంటే అడుగుతుంది. అంతే! కొంచెం దూరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయనతో బలమైన ఎమోషనల్ ఎటాచ్ మెంట్ లేదామెకు. దానికి ఆయనే కారణం!! చిన్నతనంలో కూతురితో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యలేదు మరి.. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతోంది
పిల్లలతో బలమైన అనుబంధం ఉండాలని ప్రతి తండ్రీ కోరుకుంటారు. తండ్రి కోరుకున్నట్టే.. పిల్లలూ కోరుకుంటారు. చిన్నగున్నప్పుడు పిల్లలు కోరుకుంటే. ..వయసు మీద పడ్డాక తండ్రులు కోరుకుంటారు. ఈ అనుబందం ఒక ఇన్వెస్టిమెంట్ లాంటిది. చిన్నప్పుడు పిల్లలతో గడిపితే పెద్దవాళ్లు అయినాక అదే రిటర్న్ గిఫ్ట్ వస్తుంది.అప్పుడు వాళ్లు మీతో గడపడానికి ఆసక్తి చూపిస్తారు. ఆది తెలియకే చాలా మంది.. తండ్రీ బిడ్డలు సమస్యకు చెరోవైపు నిలబడుతున్నారు.
పునాదులు అక్కడే
సెలవు రోజుల్లో తండ్రులు పిల్లలతో గడిపిన క్షణాలు పిల్లలో బలమైన ముద్ర వేస్తాయి. చిన్నప్పటి మధురమైన జ్ఞాపకాలే తర్వాతి కాలంలో తండ్రీ బిడ్డల మధ్య బలమైన అనుబంధానికి పునాది వేస్తాయి. ఏది అడిగినా తీర్చే అనుబంధంలో కాకుండా... ఎమోషన్ తో కూడిన అనుబంధాన్ని ఏర్పర్చుకోవాలి . అప్పుడే పిల్లలకు మేం సేఫ్ గా ఉన్నాం అనే భావన కలుగుతుంది. మీ దగ్గర కంపర్ట్ గా ఫిట్ అవుతారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి విషయాన్ని పంచుకుంటారు. ఆకాశమంత ప్రేమతోనే మీరు ఊహించుకున్నట్టు మీ కొడుకు, కూతురుతో అనుబంధం సాధ్యమని గుర్తుంచుకోవాలి
సెలవు వస్తే...
సెలవు వస్తే చాలు.... అబ్బ ఈ రోజు రిలీఫ్ దొరికిందిరా భయ్' అని ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లేవాడు ప్రభాకర్. ఆదివారం నాడు చికెన్ తెచ్చి.. ఇంట్లో ఇచ్చి నువ్వు మమ్మీ తినండి.. దాడీ ఈవినింగ్ వస్తాడు అని ఒక ముద్దు ఇచ్చి పోయేవాడు ఆ చిన్నారికి. సెలవు కాదు... పిల్లలకు కూడా... వాళ్లకు నాన్నాతోఆడుకోవాలని ఉంటుంది. నాన్నతో కలిసి తినాలని ఉంటుంది. నాన్నకు ఏవేవో కబుర్లు చెప్పాలని ఉంటుంది. కానీ, నాన్నేమో వారమంతా ఆఫీసులో బిజీ అంటారు. సెలవు వచ్చిందంటే. 'వారానికి ఒక్క రోజైనా ఫుల్ ఎంజాయ్ చెయ్యాలని అంటాడు. ఇంట్లో ఉండకుండా బయటకు పోతాడు అందరినీ బయటకు తీసుకుపోయి ఎంజాయ్ వాళ్లకు పంచవచ్చుగా... అప్పుడే ఆ టైంలోనే పసి మనసులో నాన్నతో ఉండే ఎమోషనల్ ఎటాచ్ మెంట్ నెమ్మదిగా పలుచబడుతుంది. దాని ప్రభావం పిల్లలు పెద్దోళ్లు అయినాక కనబడుతుంది. నా పిల్లలకు ఫుడ్ .. బెడ్.... చదువు... అవసరం ఏదైనా లోటు లేకుండా తీరుస్తున్నా.. ఇంకేం కావాలి ... వాళ్లు సంతోషంగా ఉండటానికి!" అని నాన్న అనుకుంటాడు. కానీ, పిల్లలేమో నాన్న నుంచి కొంచెం ప్రేమని ఎక్స్ పెక్ట్ చేస్తారు.
ఇప్పుడు ఎలా వస్తుంది?
పిల్లలు పెద్దవుతారు. చిన్నప్పుడు పిల్లల మనసుల్లో ఏది మెదిలిందో.... అచ్చంగా అదే ఇప్పుడు తండ్రుల మనసుల్లో మెదులుతుంది. 'నా కొడుకు లేదా కూతురు దాతో మంచిగా మాట్లాడాలి. అన్ని షేర్ చేసుకోవాలి అని లోలోపల అనుకుంటూ ఉంటారు. వాళ్లేమోదూరంగా ఉంటారు. 'ఎందుకు దూరంగా ఉంటున్నావ్ అని వీళ్లూ అడగరు.. చిన్నప్పుడు నువ్వు అలా చేశావు' అని వాళ్లూ చెప్పురు. చిన్నప్పటి నుంచి పంచుకోనిది కొత్తగా ఇప్పుడేం పంచుకుంటాం' అనేది పిల్లల భావన. చిన్నప్పటి నాన్నే ఉంటాడు. వాళ్ల మనసులో, దాని తాలుకూ ఆలోచనలు కొంచెం కూడా మారవు నాన్న ప్రేమ పొందని వాళ్లు ఆ ఎటాచ్ మెంట్ సినిమాల్లోనే సాధ్యం" అని అనుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు నా అవసరాలు తీర్పాడు కదా! ఇప్పుడు తన అవసరాలు తీర్చడమే తన బాధ్యత అనుకుంటాడు.
ఏం చెయ్యాలి?
'పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరచుకోవాలనుకునే తండ్రులు సెలవు రోజుల్లో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యాలని అమెరికా పరిశోధకులు చేపట్టిన ఓ స్టడీ ద్వారా తెలుస్తోంది. మీ వర్కింగ్ డేస్లో ఎలాగూ వాళ్లతో క్వాలిటీ టైం స్పెండ్ చెయ్యలేరు. కనీసం సెలవు రోజులైనా వాళ్లతో గడపండి... వాళ్లు చెప్పేది వినండి. మీరు కూడా ఏదో ఒకటి వాళ్లతో పంచుకోండి. వీలైతే వాళ్లతో ఆడండి... అని ఆ పరిశోధన తండ్రులకు సూచనలు చేసింది. ఇది 'ఫ్యామిలీ సైకాలజీ అనే జర్నల్లో పబ్లిష్ అయింది.
చిన్నప్పుడు తండ్రులు పిల్లలతో ఎలాంటి సంబంధాలు ఏర్పరుచుకుంటారో... అవే వాళ్లు పెద్దవాళ్లు అయినాక రిఫ్లెక్ట్ అవుతాయి. ఎవరైతే సెలవురోజుల్లో వాళ్ల పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. వర్క్ డేస్ లో పిల్లల పట్ల కేరింగ్ గా.. హాలిడేస్ లో షేరింగ్ గా ఉండాలి' అని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ప్రొఫెసర్-జియోఫ్రీ బ్రౌన్ చెప్పాడు.
మొత్తం 80 మంది తండ్రి, బిడ్డల జంటలపై పరిశోధకులు స్టడీ చేశారు. వీళ్లలో పిల్లలంతా మూడేళ్లకు పైబడిన వాళ్ళే వాళ్లందరికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. వాళ్ల నుంచి రాబట్టిన సమాచారాన్ని విశ్లేషించి సెలవు రోజుల్లో పిల్లలతో గడిపిన తండ్రీ.. పిల్లల మధ్య అనుబంధం చాలా బలంగా ఉంది' అని నిర్ధారించారు.