సొసైటీకి ఉపయోగపడే రికార్డ్ బ్రేక్

సొసైటీకి ఉపయోగపడే రికార్డ్ బ్రేక్

చదలవాడ శ్రీనివాసరావు దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. సత్య కృష్ణ , సంజన, నిహార్, తుమ్మల ప్రసన్న కుమార్, రగ్ధ ఇఫ్తాకర్, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు.  ‘మాతృదేవోభవ’ ఫేమ్ అజయ్ కుమార్, నిర్మాత రామ సత్యనారాయణ అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించినా.. నాకున్న అనుభవంతో  సొసైటీకి ఉపయోగపడే మంచి కథను డైరెక్ట్ చేయాలనుకున్నా. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఇందులో హీరోలే. పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా అన్ని భాషల్లోనూ రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.  ఈ చిత్రంలో మంచి రోల్స్ చేసినందుకు ఆనందంగా ఉందన్నారు నటీనటులు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.