Redmi: రెడ్ మీ నోట్ 12 సిరీస్ లాంచ్ అయింది

Redmi: రెడ్ మీ నోట్ 12 సిరీస్ లాంచ్ అయింది

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు కేరాఫ్ అయిన రెడ్ మీ, కొత్తగా నోట్ 12 సిరీస్ ని  లాంచ్ చేసింది. రెడ్ మీ నోట్ సిరీర్ లో మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటాయని షావోమి తెలిపింది. నోట్ 12 5జీ, నోట్ 12 ప్రో+, నోట్ 12 ప్రో 5జీ ఫోన్లను మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్లలో అమోలెడ్ డిస్ ప్లే, 5జీ కనెక్టివిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లలో కెమెరా క్వాలిటీ మొరుగుపరిచామని కంపెనీ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది. 

రెడ్ మీ నోట్ 12 5జీ ధర 4జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ఫోన్ ధర రూ.15,499, 6జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ఫోన్ ధర రూ.17,499 ఉన్నాయి. నోట్ 12 ప్రో 5జీ 6 జీబీ, 8జీబీ, 8జీబీ+256 జీబీ మెమరీ వేరియెంట్లలో వస్తున్నాయి. వీటి ధర రూ. 20,999, రూ.22,999, రూ. 23.999 గా ఉన్నాయి. నోట్ 12 ప్రో+ 5జీ ఫోన్లు 8జీబీ, 12 జీబీ 256  జీబీ మెమరీతో లాంచ్ అయ్యాయి. ప్రారంభం ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ నడుస్తుంది. ఎక్స్ చేంజ్ ఆఫర్ ని కూడా నడుస్తుంది. త్వరలో వీటి సేల్స్ ప్రారంభం కానున్నాయి.