వాతావరణం ఏదైనా జుట్టు అందంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే జుట్టు సమస్యలను తగ్గించుకుని, కురులను నిగనిగలాడేలా ఉంచుకోవచ్చు.
*వాతావరణం వేడిగా ఉంటే తలకు నూనె బదులు హెయిర్ సిరమ్ వాడాలి.
*తలస్నానానికి ఎప్పుడూ తక్కువ గాఢత ఉన్న షాంపూలనే వాడాలి. ఇవి జుట్టులోని తేమని కాపాడి, చివర్లు చిట్లకుండా చూస్తాయి.
*స్ట్రయిట్నర్, కర్లర్ వాడే ముందు తప్పని సరిగా కండీషనర్, హెయిర్ ప్రొటెక్షన్ సిరమ్ రాయాలి.
*జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కెరటిన్, ప్రాంతెనాల్, అలొవెరా ప్రొడక్ట్స్ నే ఎంచుకోవాలి.
*పొల్యూషన్ నుంచి జుట్టుని కాపాడుకోవడానికి తలకు టోపీ పెట్టుకోవాలి లేదా స్కార్ఫ్, స్టోల్ కట్టుకోవాలి.
*దువ్వెనలు, బ్రష్లను తరచూ వేడినీళ్లతో కడగాలి. వేరేవాళ్ల దువ్వెనల్ని అస్సలు వాడకూడదు.
