
సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న హిందీ చిత్రం ‘సికందర్’. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈద్ రోజున అనౌన్స్ చేసిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను గురువారం నుంచి ప్రారంభించారు. ‘యాక్షన్ బిగిన్స్’ అంటూ ఈ చిత్రానికి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఓపెనింగ్ ఫొటోలను షేర్ చేశారు నిర్మాతలు.
జులై మొదటి వారం వరకూ ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఎయిర్ క్రాఫ్ట్‌లో సల్మాన్‌పై వచ్చే సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. రష్మిక ఇందులో హీరోయిన్‌గా కనిపించబోతోంది. అలాగే సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నారట. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.