రిపబ్లిక్ డే సేల్ : భారీ డిస్కౌంట్తో ఓలా ఎలక్ట్రిక్ S1సిరీస్ స్కూటర్లు

రిపబ్లిక్ డే సేల్ : భారీ డిస్కౌంట్తో ఓలా ఎలక్ట్రిక్ S1సిరీస్ స్కూటర్లు

Ola Electric రిపబ్లిక్ డే సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్లు జనవరి 31, 2024 మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని మోడళ్లకు వర్తిస్తాయి.ఓలా ఎలక్ట్రిక్ రిపబ్లిక్ డే ఆఫర్లలో పొడిగించిన వారంటీపై 50 శాతం డిస్కైంట్, S1 ఎయిర్, S1 ప్రో మోడళ్లపై రూ. 2 వేల ఎక్ఛేంజ్ బోనస్ ఇస్తోంది. 

ఇంకా క్రెడిట్ కార్డు EMI ద్వారా  కొనుగోలుదారులు రూ. 5 వేల వరకు డిస్కౌంట్ ను పొందొచ్చు. కంపెనీ జీరోడౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 7.99 శాతం నుంచి వడ్డీరేట్లు వంటి అనేక ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తోంది. ఇంకా Ola S1X+  గత ఏడాది డిసెంబర్ లో ప్రకటించిన రూ. 20వేల తగ్గింపును కూడా కొనసాగిస్తుంది. 

Ola S1X ధర రూ. 89,999 (ఎక్స్ షోరూమ్ )

ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ లో మొత్తం ఐదు మోడళ్లు ఉన్నాయి. 

  • ఓలా S1X(2kWh)
  • ఓలా S1X(3kWh)
  • ఓలా S1X +
  • ఓలా S1 ఎయిర్
  • ఓలా S1 ప్రో

ఓలా ఈ-స్కూటర్ల ధర రూ.89,999 నుంచి రూ. 1.47 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.