కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ఆగస్టు 27న విడుదల

కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ఆగస్టు 27న విడుదల

కీర్తి సురేష్​  టైటిల్ రోల్‌‌‌‌లో నటించిన చిత్రం ‘రివాల్వర్ రీటా’. జే.కే చంద్రు  దర్శకత్వం వహించాడు. తెలుగు,  తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌‌‌‌కుమార్, సునీల్,  అజయ్ ఘోష్, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ చిత్రం అనుకోని అవాంతరాలతో ఆలస్యమైంది.  ఎట్టకేలకు మూవీ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్‌‌‌‌. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కీర్తి సురేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఓ ట్రాలీ సూట్‌‌‌‌కేస్‌‌‌‌పై ఆమె కూర్చోగా, అందులో నుంచి ఓ చేయి బయటకి కనిపిస్తోంది. క్రైమ్‌‌‌‌ కామెడీతో ఈ చిత్రం ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేయబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందించాడు. సుధన్ సుందరం,  జగదీష్ పళనిస్వామి నిర్మించారు.