హనీమూన్ ఎక్స్‌‌ప్రెస్ .. ఫస్ట్ లిరికల్ సాంగ్‌ రిలీజ్

హనీమూన్ ఎక్స్‌‌ప్రెస్ .. ఫస్ట్ లిరికల్ సాంగ్‌ రిలీజ్

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా  బాల రాజశేఖరుని తెరకెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌‌ప్రెస్’. కె కె ఆర్, బాల రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసి, సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ‘నిజమా.. నిజమా.. ఇది కనులు కలగన సాధ్యమా.. ఇరు ఎదల అలజడి సాధ్యమా.. ఇదే మొదటి చినుకుల తడై తాకుతూ వరదలా మదిని ముంచిన వైఖరి’ అంటూ సాగిన మెలోడీ సాంగ్‌‌లో చైతన్య రావు, హెబ్బా పటేల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. 

ఈ సాంగ్ కంపోజ్ చేసిన కళ్యాణి మాలిక్.. సింగర్ సునీత కలిసి పాడిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. ‘పెదవులే అడగని రుచులు వెతికిన హాయి ఇది.. వయసుకు తెలియని మొదటి అనుభవమైనది’ అంటూ  కిట్టు విస్సా ప్రగడ యూత్‌ను అట్రాక్ట్ చేసేలా క్యాచీ లిరిక్స్ రాశాడు.  తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తునట్టు మేకర్స్ చెప్పారు.