నువ్వు అసాధ్యుడివి వర్మ.. చీర సుందరితో మూవీ మొదలెట్టేశాడు

నువ్వు అసాధ్యుడివి వర్మ.. చీర సుందరితో మూవీ మొదలెట్టేశాడు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopalvarma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలా కాకుండా బిన్నంగా సినిమాలు చేయడం ఆయన అలవాటు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి ఆయన వెళ్ళడు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉండే వర్మ.. సమాజంలో జరిగే సంఘటనలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉంటారు.

ఇటీవలే సోషల్ మీడియాలో చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి(శ్రీలక్ష్మీ సతీష్) వీడియోలను ఆర్జీవి షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ పోస్టులు కూడా వేశాడు. అంతేకాదు.. ఆ అమ్మాయిని చూశాక చీరపై ఇష్టం పెరిగిందని, ఆమెను హీరోయిన్ గా పెట్టి చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆ అమ్మాయి మరెవరో కాదు మలయాళ నటి శ్రీలక్ష్మీ సతీష్. ఆమెపై రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో తగ వైరల్ అయ్యాయి.

చివరికి ఆ అమ్మాయి గురించి తెలుసుకున్న ఆర్జీవీ తాను అనుకుంటున్నట్టుగానే ఆమెతో సారీ అనే సినిమా చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సారీ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు వర్మ. ఈ సినిమాకు ఆ అమ్మాయిని అందం గా వీడియోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ నే దర్శకుడి గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ నువ్వు అసాధ్యుడివి వర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.