RGV Tweet: వ్యూహం వచ్చేస్తోంది..బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్

RGV Tweet: వ్యూహం వచ్చేస్తోంది..బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహాన్ని సెన్సార్ బోర్డు రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ వెనక్కడుగు వేయకుండా..పట్టు వదలని విక్రమార్కుడిలా తన వ్యూహాలతో..ఎట్టకేలకు వ్యూహం రిలీజ్ డేట్ తీసుకొచ్చాడు. 

లేటెస్ట్గా వ్యూహం సినిమా రిలీజ్కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ నెల డిసెంబర్ 29న వ్యూహం థియేటర్లోకి వస్తోంది..ఈ వార్త చెడ్డళ్లకు చేదు వార్తే..అని ఆర్జీవీ తెలిపారు.ఇప్పటికే థియేటర్లో విడుదల అవ్వాల్సిన సినిమా..కొత్త రిలీజ్ డేట్ రావడంతో ఆర్జీవీ ఫ్యాన్స్..సీఎం జగనన్న ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ వైరల్ అవుతుంది. 

గతంలో వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. కారణం ఏంటంటే..ఈ సినిమాలో తీసుకున్న కంటెంట్..ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం, ఈ చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగా వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది బోర్డు. ఇక సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై వ్యూహం మేకర్స్ రీవైజింగ్ కమిటీకి కూడా అప్లై చేశారు.ఇక తర్జన..భర్జనలు పడి..ఎట్టకేలకు సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు ఆర్జీవీ.