నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ దసరా దేవి శరన్నవ రాత్రులు పురస్కరించుకొని బియ్యపు గింజపై దుర్గామాతను, మహిషాసురుని సూక్ష్మ చిత్రాలు మైక్రో బ్రష్ ద్వారా వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ దేవి శరన్నవ రాత్రులలో అమ్మ వారిని తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క అవతారంతో అలంకరణ చేసి పూజిస్తారు. అందుకే దేవి నవరాత్రులు అని అంటారు.
దసరా నవ రాత్రులలో అత్యంత పవిత్రమైన, శక్తి వంతమైన రోజు దుర్గాష్టమి రోజున లోక కంటకుడైన మహిషాసురుని సంహారించడానికి అమ్మవారు దుర్గాదేవి రూపం దాల్చింది. అందుకే ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవి రూపాన్ని, మహిషాసుర రూపాన్ని వేసాను. మహిషా అంటే దున్నపోతు. మహిషాసురుడు దున్నపోతు ఆకారంలో ఉంటాడు కాబట్టి దున్నపోతు ఆకారంలో చూపించానని తెలిపారు. రెండు సూక్ష్మ చిత్రాలు ఈ బియ్యపు గింజలో చూపించాను.
భారతదేశంలో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. హిందువులకు ముఖ్యమైన పెద్ద పండుగ. భక్తులందరికి దసరా పర్వదిన శుభాకాంక్షలు. అందరికి ఆ దుర్గామాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానని చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
