Big Breaking Kantara: రిషబ్ శెట్టి విశ్వరూపం చూసేయండి

Big Breaking Kantara: రిషబ్ శెట్టి విశ్వరూపం చూసేయండి

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా కాంతారా. 2021 లో రిలీజైన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందుకుంది. కాంతారా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి దాదాపు రూ.400 కోట్ల వరకు కల్లెక్షన్స్ సాధించి కన్నడ ఇండస్ట్రీలోనే బాక్సాపీస్ బాద్షా అనిపించుకుంది. ప్రస్తుతం కాంతారా సినిమాకు ప్రీక్వెల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

లేటెస్ట్గా కాంతారా చాప్టర్ 1 (ప్రీక్వెల్) ఫస్ట్ లుక్ పోస్టర్తో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు' అంటూ గంబీరంగా గర్జిస్తూ ఉన్న రిషబ్ శెట్టి పోస్టర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. చీకటి కమ్మేసిన అడవిలో..ఒక చేతిలో త్రిశూలం..మరో చేతిలో గండ్ర గొడ్డలితో ఉన్నరిషబ్ శెట్టి విశ్వరూపం చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేలా ఉంది. 

రిలీజ్ చేసిన టీజర్ లో కాంతారా ఎక్కడ ఎండ్ కార్డ్ పడిందో..అక్కడే మొదలవుతూ..ఒక మాయలోకంలోకి తీసుకెళ్లే విధంగా..గ్రాఫిక్స్..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..రిషబ్ లుక్స్ ఉన్నాయి. కాంతారలో రిషబ్ శెట్టి..శివతో పాటు తండ్రి పాత్రలోనూ డ్యుయల్ రోల్‍ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంతార పార్ట్ 1లో శివ తండ్రి (రిషబ్ శెట్టి) కథను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.100 కోట్లుకు పైగా ఖర్చుపెట్టి..చాలా ప్రత్యేకతలతో తెరకెక్కిస్తున్నారు రిషబ్ శెట్టి. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

కాంతార చాప్టర్-1 కి కూడా హీరో రిషబ్ శెట్టినే కథను అందిస్తూ..దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీని హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.