పంత్ రాజీనామా చేశాడా.. లేక తప్పించారా?.. గోయెంకాపై నెట్టింట ట్రోలింగ్!

పంత్ రాజీనామా చేశాడా.. లేక తప్పించారా?.. గోయెంకాపై నెట్టింట ట్రోలింగ్!

Rishabh Pant: ఐపీఎల్ 2026 సీజన్ ముగుస్తున్న వేళ క్రికెట్ ప్రపంచంలో మరో పెను సంచలనం నమోదైంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. పంత్ స్వయంగా తనను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరగా.. దానికి తాము అంగీకరించినట్లు లక్నో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ తేల్చి చెప్పారు.  

కెప్టెన్‌గా విఫలమైన పంత్: 
ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరతో లక్నో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్.. కెప్టెన్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేవలం 4 మ్యాచ్‌ల్లోనే గెలిచి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో పంత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది.  

నెట్టింట సంజీవ్ గోయెంకాపై ట్రోల్స్: 
పంత్ రాజీనామా చేస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వరద పారుతోంది. రిషబ్  పర్సనల్‌గా తప్పుకున్నాడని ఫ్రాంచైజీ చెప్తున్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీన్ని "ఫోర్స్డ్ డెసిషన్" (బలవంతపు నిర్ణయం) అని కొట్టిపారేస్తున్నారు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా గతంలో కేఎల్ రాహుల్‌ను గ్రౌండ్‌లోనే క్లాస్ పీకిన ఇన్సిడెంట్‌ను గుర్తు చేస్తూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

నెట్టింట క్రేజీ కామెంట్స్: 
* గోయెంకానే జట్టు నుంచి బయటకు నెట్టేశాడు.. పంత్ వచ్చాక మొత్తం టీమ్ మునిగిపోయిందని ఒకరు కామెంట్ చేయగా..
* రిక్వెస్ట్ అంట! మనందరికీ తెలుసు లక్నోనే అతన్ని కెప్టెన్సీ నుంచి తరిమేసిందని.. నెక్స్ట్ సీజన్‌కు అసలు టీమ్ నుంచే రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదంటూ మరికొందరు కౌంటర్లు వేస్తున్నారు.

లక్నో నెక్స్ట్ ప్లాన్ ఏంటి?: 
ఈ సీజన్ లో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు కూడా అస్సలు కలిసిరాలేదు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 312 రన్స్ మాత్రమే చేశాడు. అందులోనూ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్సీ ప్రెజర్ వల్లే పంత్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాడని భావించిన మేనేజ్‌మెంట్.. అతన్ని కేవలం ప్లేయర్‌గా మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది.  

కెప్టెన్సీ రేసులో మార్క్రమ్, మార్ష్: 
ప్రస్తుతం లక్నో కెప్టెన్సీ రేసులో ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఐపీఎల్ కప్పు గెలవాలనే కసితో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. టీమ్‌ను మొత్తం రీబిల్డ్ చేయడానికి ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది. మరి కెప్టెన్సీ భారం దిగిపోయాకైనా పంత్ పాత ఫామ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.