టాలీవుడ్‌లోకి రితేశ్ దేశ్‌ముఖ్ ఎంట్రీ.. రామ్ పోతినేని ‘రాపో 23’లో కీలక పాత్ర  

టాలీవుడ్‌లోకి రితేశ్ దేశ్‌ముఖ్ ఎంట్రీ.. రామ్ పోతినేని ‘రాపో 23’లో కీలక పాత్ర  

బాలీవుడ్‌‌లో విభిన్నమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న  రితేశ్ దేశ్‌‌ముఖ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆయన  కీలక పాత్ర పోషిస్తున్నట్టు సోమవారం రివీల్ చేశారు. ‘రాపో 23’ వర్కింగ్ టైటిల్‌‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌‌లోనే రితేష్ పాల్గొన్నాడు.  ఈ సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.

షూటింగ్ సెట్‌‌లోకి వచ్చిన రితేశ్ దేశ్‌‌ముఖ్‌‌కు రామ్ పోతినేని గ్రాండ్ వెల్‌‌కమ్ పలికాడు.   ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.  ఏక్ విలన్,  రైడ్ 2,  రాజా శివాజీ లాంటి వరుస హిట్స్‌‌తో జోష్ మీదున్న   రితేశ్ దేశ్‌‌ముఖ్ టాలీవుడ్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.  సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌‌గా నటిస్తోంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌‌‌‌పై   రామ్ పోతినేని బ్రదర్ కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు