Valari Trailer: ష్..దెయ్యం వస్తోంది..ఉత్కంఠగా వ‌ళ‌రి ట్రైలర్

 Valari Trailer: ష్..దెయ్యం వస్తోంది..ఉత్కంఠగా వ‌ళ‌రి ట్రైలర్

గురు సినిమాలో రితికా సింగ్ (RitikaSingh)ను ఇష్టపడని వారు ఉండరేమో. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఈ బ్యూటీ కట్టి పడేసింది. లేటెస్ట్గా రితికా నటించిన హారర్ ఫిల్మ్ వ‌ళ‌రి(Valari) ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పిండం ఫేమ్ శ్రీరామ్,రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  

“వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి..ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?..అది ఒక దెయ్యాల కొంప..ఇల్లు మోసేసి ఎన్నో ఏళ్లయింది.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. రితికా సింగ్  తనదైన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. శ్రీరామ్ పాత్ర కూడా కీలకంగా కనిపిస్తోంది. డైరెక్టర్ మృతిక సంతోషిణి తెరకెక్కించిన విధానం ట్రైలర్ తోనే ఉత్కంఠ పెంచేసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ..నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‌లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రితికా సింగ్ సినిమాల విషయానికి వస్తే..

బాక్సర్​ అయిన రితికా ఫిట్నెస్​ వీడియోలతో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. దీంతో రితికాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీ గానే ఉంది. ఆండవన్ కోమండి, శివలింగ, ఓ మై గాడ్, కోలా,హత్య మూవీస్లో నటించింది. ప్రస్తుతం రజినీకాంత్ 170వ మూవీలో విభిన్నమైన రోల్లో నటిస్తోంది.

*వ‌ళ‌రి ట్రైలర్ -: https://youtu.be/HC8IDgxAOhA?si=xmIgGhW1IZFV8X6Y