రివర్ ఈవీ స్కూటర్ల షోరూమ్​ షురూ 

రివర్ ఈవీ స్కూటర్ల షోరూమ్​ షురూ 

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: ఇండీ పేరుతో ఎలక్ట్రిక్​ స్కూటర్లు తయారు చేసే బెంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళూరుకు చెందిన రివర్​ హైదరాబాద్​ మార్కెట్లో అడుగుపెట్టింది. కూకట్​పల్లిలో మొదటి షోరూమ్​ను బుధవారం ప్రారంభించింది.  స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీప భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విష్యత్తులోనే చెన్నై, కొచ్చి, కోయంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్తూరు, త్రివేండ్రం లాంటి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విస్తరిస్తామని  రివర్ సీఈఓ అర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వింద్ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణి చెప్పారు. హైదరాబాద్​లో మరిన్ని స్టోర్లు తెరుస్తామని చెప్పారు.

ఇండీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్స్ షోరూం ధర రూ.1.38 లక్షలు. దీనిని ఐదు గంటలు చార్జ్​చేస్తే 120 కిలోమీటర్లు వెళ్తుంది. మాగ్జిమమ్​ స్పీడ్​ 90 కిలోమీటర్లు.